సహకార బ్యాంక్ మాజీ ఛైర్మన్ అరెస్ట్
బెంగళూరుకు చెందిన శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంక్ నియమిత ఛైర్మన్ కె రామకృష్ణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ బ్యాంకులో రూ.1000 కోట్ల స్కామ్ జరిగిందని ఈడీ పేర్కొంది. ఈ బ్యాంక్‌కు ఉన్న డిపాజిట్ల మొత్తం రూ. 2291 కోట్లు, రుణాలు రూ. 1687 కోట్లు. ఇందులో కూడా రూ. 1000 కోట్లను గోల్‌మాల్ చేశారని ఈడీ అంటోంది… బ్యాంకు డిపాజిట్లర్లు మాత్రం ఈ స్కామ్ రూ.1400 కోట్లని అంటున్నారు. డిపాజిట్లను తమ వాళ్ళకే రుణాలుగా ఇచ్చి ఛైర్మన్, ఇతరులు కుంభకోణానికి పాల్పడ్డారు. ఇపుడు రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉండటంతో చాలా మంది డిపాజిటర్లు ఈ కుంభకోణం నుంచి తక్కువ నష్టంతో బయటపడ్డారు. ఈ బ్యాంక్ స్కామ్ 2020లో బయటపడింది. అప్పటి నుంచి బ్యాంక్ ఆర్‌బీఐ నియమించిన అధికారి చేతిలో ఉంది. బ్యాంక్ సీఈఓ వాసుదేవ ఆత్మహత్య చేసుకున్నాడు.