For Money

Business News

నిర్మలమ్మ నుంచి ఏడో బడ్జెట్‌

ఇవాళ కొత్త కేంద్ర కేబినెట్‌లో శాఖల కేటాయింపు పూర్తయింది. సీనియర్‌ మంత్రుల శాఖల్లో మార్పులు లేవు. చాలా వరకు ప్రధాన క్యాబినెట్‌ మంత్రులకు పాత శాఖలే కేటాయించారు. ఆర్థికశాఖను నిర్మలా సీతారామన్‌కు కేటాయించారు. ఈసారి ఆర్థిక శాఖను వేరే మంత్రికి కేటాయిస్తారని చాలా మంది ఊహించారు. కాని నిర్మల శాఖ మారలేదు. దీంతో ఆమె పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటి వరకు ఆరు బడ్జెట్‌లు ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పిన నిర్మలమ్మ ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. 2019లో ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టిన ఆమె ఇప్పటి వరకు అయిదు పూర్తి స్థాయి బడ్జెట్‌లతో పాటు 2014 సార్వత్రిక ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్‌ను కూడా ప్రవేశ పెట్టారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఆరేడు నెలలు పని చేసిన నిర్మల శాఖ… అరుణ్‌ జైట్లీ మరణం తరవాత ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. నిర్మలా సీతారామన్‌ కొనసాగింపు స్టాక్‌ మార్కెట్‌లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌ నుంచి భారీగా పెట్టుబడులను ఉపసంహరించారు. ఇపుడు స్టాక్‌ మార్కెట్‌ పూర్తిగా దేశీయ ఇన్వెస్టర్ల చేతిలో ఉంది. పైగా ఎన్నికల సమయంలో పలు బిజినెస్‌ సమావేశాల్లో ఆమె వ్యవహరించిన తీరుపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. నిర్మలమ్మ పద్దులపై సాధారణ, దిగువ మధ్య తరగతి తీవ్ర వ్యతిరేకత కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ను మార్చుతారని స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు ఆశించాయి. దీంతో రేపు స్టాక్‌ మార్కెట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.