F &Oలో ఈ షేర్లలో ట్రేడింగ్ అనుమతి
ఇవాళ కొత్తగా ఏడు షేర్లలో ఫ్యూచర్స్, ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ)ను అనుమతించేందుకు స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్ణయించారు. డిసెంబర్ 31 నుంచి ఎఫ్ అండ్ ఓ ఈ షేర్లలో పొజిషన్స్ తీసుకోవచ్చు. అంటే జనవరి సిరీస్ నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నమాట. తాజాగా అనుమతించిన షేర్లు..
1. బలరాంపూర్ చిని మిల్స్ లిమిటెడ్
2. గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (జీఎన్ఎఫ్సీ)
3. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్
4. ఎన్బీసీసీ (ఇండియా) లిమిటెడ్
5. రైన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
6. సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్
7. టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్
వీటికు తోడు ఇప్పటికే మూడు షేర్లను అనుమతించారు. అవి..ఐడీఎఫ్సీ, హనీవెల్, ఆదిత్య బిర్లా కార్ప్. అంటే జనవరి 1వ తేదీ నుంచి మొత్తం పది షేర్లను ఎఫ్ అండ్ ఓలోకి అనుమతిస్తున్నారన్నమాట.