For Money

Business News

3 సెషన్స్‌… టార్గెట్‌ దాటేసింది

గత గురువారం టీవీ5 బిజినెస్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ రాజేష్‌ పాలవియా ఇచ్చిన షేర్‌ రెకమెండేషన్‌ కేవలం మూడు సెషన్స్‌లో టార్గెట్‌ను దాటడం విశేషం. గత గురువారం ఆయన ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రంగానికి చెందిన మిడ్‌ క్యాప్‌ షేర్‌ పర్వోటెక్‌ పవర్‌ను కొనుగోలు చేయాలని సిఫారసు చేశారు. బుధవారం రూ. 142 వద్ద ఈ షేర్‌ క్లోజ్‌కాగా రూ. 110 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని రాజేష్‌ సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చిన టార్గెట్‌ రూ. రూ. 180 నుంచి రూ. 200. ఈ షేర్‌ గురువారం రూ. 145.40 వద్ద ప్రారంభమై రూ. 144.45కి పడింది. చాలా సేపు రూ. 150లోపు ఉన్న ఈ షేర్‌ మిడ్‌ సెషన్‌ తరవాత 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ.157.25 వద్ద ముగిసింది. శుక్రవారం సీలింగ్‌ 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది. దీంతో గత శుక్రవారం ఈ షేర్‌ పది శాతం అప్పర్‌ సీలింగ్‌తో ముగిసింది. గత శుక్రవారం రూ. 173 వద్ద ముగిసిన ఈ షేర్‌ ఇవాళ మార్కెట్‌ బలహీనంగా ఉన్నా రూ. 186.70ని తాకింది. అంటే తొలి టార్గెట్‌ను దాటేసింది. దాదాపు ఎనిమిది శాతం దాకా పెరిగిన ఈ షేర్ 2 శాతం లాభంతో రూ. 177 వద్ద ముగిసింది. రెండో టార్గెట్ రూ. 200ను ఈ షేర్‌ చాలా త్వరగానే టచ్‌ చేసే అవకాశం కన్పిస్తోంది. ఈవీ రంగానికి చెందిన షేర్లకు మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్ల పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.

Leave a Reply