For Money

Business News

ఇవాళ మార్కెట్‌లో ఏం జరిగింది?

నిఫ్టి నిన్ననే తన కీలక మద్దతు స్థాయి 25150ని కోల్పోయింది. నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్‌ ట్రెండ్‌ ఇవాళ మన మార్కెట్‌లను మరింత దెబ్బతీసింది. షేర్ల ధరలు చాలా అధికంగా ఉన్నాయని భావిస్తున్న చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారు. కేవలం క్రూడ్‌ ఆయిల్‌ తగ్గడం వల్ల సంబంధిత రంగాల షేర్లు మినహాయిస్తే… మిగిలిన దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంక్‌ నిఫ్టి ఏకంగా 1.7 శాతం క్షీణించగా, ఇతర కీలక సూచీలన్నీ ఒకటిన్నర శాతం దాకా నష్టపోయాయి. ఉదయం లాభాల్లోప్రారంభమైనా.. కొంత సేపటికే నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగానికి చెందిన పలు షేర్లు భారీగా నష్టపోయాయి. అనేక షేర్లలో నష్టాలు అయిదు శాతం దాకా ఉన్నాయి. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లో 25168 పాయింట్ల స్థాయిని తాకినా.. మిడ్‌ సెషన్‌ తరవాత 24801 పాయింట్లను తాకింది. అంటే 367 పాయింట్ల దాకా క్షీణించింది. ఒకదశలో 1.5 శాతంపైగా నష్టపోయిన నిఫ్టి క్లోజింగ్‌లో292 పాయింట్ల నష్టంతో 24852 పాయింట్ల వద్ద ముగిసింది. 24850 పాయింట్లపైన క్లోజ్‌ కావడం బుల్స్‌కు కాస్త ఊరట కల్గించే అంశం. అయితే ఇవాళ బేర్స్‌ పండుగ చేసుకున్నారు. ఆరంభంలో కాస్త బెట్టు చేసిన ఐటీ షేర్లు కూడా క్రమంగా బలహీనపడుతూ వచ్చాయి. అమెరికా ఫ్యూచర్స్‌ ఇంకా నష్టాల్లో ఉండటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అలాగే సుశీల్‌ కేడియా చాలా వంటి మార్కెట్‌ విశ్లేషకులు భారీ కరెక్షన్‌ను సూచిస్తుండటంతో ఇన్వెస్టర్లలో భయం పెరుగుతోంది. ఎఫ్‌ఎంసీజీ షేర్లలో మారికో ఇవాళ భారీగా రాణించింది. స్పెషాలిటీ కెమికల్స్‌ షేర్లలో కొన్ని ప్రధాన షేర్లు నష్టపోయాయి. ఇక నిఫ్టి విషయానికొస్తే..బజాజ్‌ ఫైనాన్స్‌ ఇవాళ కూడా నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో నిలిచింది. అలాగే ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ ట్రీ, నెస్లే కౌంటర్లు లాభాల్లో ముగిశాయి. ఇవాళ ఎస్‌బీఐ కార్డ్స్‌ భారీ లాభాల్లో క్లోజ్‌ కాగా ఎస్‌బీఐ కౌంటర్‌ 4.28 శాతం నష్టపోయింది. ఇక బీపీసీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు కూడా టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి.

Leave a Reply