For Money

Business News

MID REVIEW: సెన్సెక్స్‌ 1000 పాయింట్ల అప్‌

యూరో మార్కెట్లు అందించిన ఉత్సాహంతో మన సూచీలు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం నుంచి ఒక మోస్తరు లాభాలకే పరిమితమైన నిఫ్టి… యూరో ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండటంతో కోలుకోవడం ప్రారంభమైంది. యూరో మార్కెట్లు ప్రారంభం కావడం, ప్రధాన సూచీలు మూడు శాతంపైగా లాభపడటంతో నిఫ్టి పరుగులు పెట్టింది. ఇవాళ్టి కనిష్ఠస్థాయితో పోలిస్తే 320 పాయింట్లు పెరిగింది. 15,990 నుంచి 16325ని తాకింది. సెన్సెక్స్‌ కూడా 1000 పాయింట్లకు పైగా లాభపడి 54 464 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో ఎం అండ్‌ ఎం టాప్‌ గెయినర్‌ కాగా, శ్రీ సిమెంట్స్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఇక మిడ్‌ క్యాప్‌లో పెట్రోనెట్‌ మినహా మిగిలిన 24 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి.