For Money

Business News

57,000 దాటిన సెన్సెక్స్‌

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ ఇవాళ 57000 స్థాయిని దాటింది. నిన్న క్షీణించిన షేర్లు ఇవాళ పెరిగాయి.. నిన్న పెరిగిన షేర్లు ఇవాళ తగ్గాయి. మెటల్స్‌ లాభాల స్వీకరణ, ఐటీ షేర్లకు మద్దతు ఇలానే ఉంది. బ్యాంక్‌ నిఫ్టి వీక్‌గా ఉంది. 16,947 వద్ద ప్రారంభమైన నిఫ్టి16974ని దాటిన తరవాత 16,957 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 26 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. చైనా ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉన్నందున చైనాతో పాటు హాంగ్‌కాంగ్‌ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరడంతో… సాధారణ ఇన్వెస్టర్లకు మార్కెట్‌ దూరమౌతోంది. భారీ పెట్టుబడి పెడితేగాని మార్కెట్‌లో ట్రేడ్‌ చేయడం కష్టంగా ఉంది. చిన్న సైజ్‌ షేర్‌ కొనాలన్నా భారీ మొత్తం అవసరమౌతోంది. అందుకే మార్కెట్‌ విశ్లేషకులు కూడా నిఫ్టిని అధిక స్థాయిలో లాభాలు స్వీకరించమని సలహాలు ఇస్తున్నారు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,184.65 1.83
టెక్‌ మహీంద్రా 1,437.00 1.25
భారతీ ఎయిర్‌టెల్‌ 628.05 1.22
దివీస్‌ ల్యాబ్‌ 5,162.30 1.14
బ్రిటానియా 4,023.60 0.93

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా మోటార్స్‌ 288.90 -1.04
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 682.10 -0.65
ఎం అండ్‌ ఎం 786.80 -0.60
ఓఎన్‌జీసీ 119.50 -0.54
ఐసీఐసీఐ బ్యాంక్‌ 709.95 -0.52