NIFTY TRADE: పెరిగితే అమ్మండి
మార్కెట్‌లో బలం లేదని, నిఫ్టి పెరిగితే అమ్మడమే శ్రేయస్కరని స్టాక్ మార్కెట్ అనలిస్ట్ వీరందర్ కుమార్ అంటున్నారు. 17000 కాల్ రైటింగ్ జోరుగా ఉందని.. కాబట్టి ఈ స్థాయిని దాటి నిఫ్టి ముందుకు సాగాలంటే స్టార్ కవరింగ్ రావాలని ఆయన అన్నారు. 17020ని దాటి, నిఫ్టి ఆ స్థాయిలో నిలదొక్కుకుంటేనే నిఫ్టి ముందుకు సాగుతుందని ఆయన అంటున్నారు. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు రూ. 4000 కోట్లకు పైగా అమ్మారు. పుట్ రైటింగ్‌పై ఇంకా క్లారిటీ లేదని.. అంటే దీనర్థం నిఫ్టి పతనం ఎక్కడ ఆగుతుందనే విషయంలో క్లారిటీ లేదని ఆయన అన్నారు. ఈ సమయంలో నిఫ్టికి 16904 లేదా 16969 వద్ద గట్టి ప్రతిఘటన వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ రెండు స్థాయలను దాటితే 17020 వద్ద గట్టి ప్రతిఘటన ఉంటుంది. ఇక నిఫ్టి గనుక మద్దతు కోల్పోతే 16757, ఆ తరవాత 17688ని నిఫ్టి చేరుతుందని అంటున్నారు. 16688 స్థాయి 200 Day Exponential Moving Average అని ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టి నేరుగా 16570కి చేరుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టి ఇతర లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=fSL0EO0chFA