For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు కాస్త పటిష్ఠంగా ఉన్నాయని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ అంటున్నారు. డౌజోన్స్‌ ఇప్పటికే మార్చి కనిష్ఠ స్థాయిని చేరిందని, అయితే మన మార్కెట్‌ మార్చి కనిష్ఠస్థాయి 15700 ..అని మనం ఇంకా 1000 పాయింట్ల ఎక్కువగా ఉన్నామని వీరేందర్ అంటున్నారు. అయితే మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడి ఉందని అంటున్నారు. అత్యధికం కాల్‌ రైటింగ్‌ 16900 ఉందని, అలాగే 16800 వద్ద భారీ కాల్ రైటింగ్‌ ఉందని ఆయన అంటున్నారు. అయితే పుట్‌ వైపు అత్యధిక రైటింగ్‌ 16500 వద్ద ఉందని అన్నారు. 16400 వద్ద కూడా పుట్‌ రైటింగ్‌ జరుగుతోంది. కాబట్టి 16400 నుంచి 16800 లేదా 16900 మధ్య నిఫ్టి కదలాడే అవకాశముందని అన్నారు. మార్కెట్‌ ఓపెనింగ్‌ షార్ట్‌ చేయొద్దని ఆయన చెప్పారు. ఇప్పటికే షార్ట్‌ పొజిషన్‌ ఉన్నవారు 16540 లేదా 16437 మధ్య లాభాలు స్వీకరించి బయటపడమని సలహా ఇచ్చారు. ఈ స్థాయిలో నిఫ్టి షార్ట్‌ చేయద్దని అన్నారు. ఇక్కడి నుంచి నిఫ్టి కోలుకుంటే మాత్రం అధిక స్థాయిలో షార్ట్‌ చేయొచ్చని అన్నారు. నిఫ్టికి 16740 లేదా 16810వద్ద తీవ్ర ఒత్తిడికి అవకాశముంది. పూర్తి స్థాయి లెవల్స్‌, బ్యాంక్‌ నిఫ్టి లెవల్స్‌ కోసం దిగువ వీడియోలను చూగలరు.