For Money

Business News

రూ. 1.51 లక్షలకు పసిడి

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరలు ఇవాళ కూడా భారీగా క్షీణించాయి. ప్రపంచ బాండ్‌ మార్కెట్లలో ఈల్డ్స్‌ భారీగా పెరగడంతో బులియన్‌ ధరలు తగ్గాయి. డాలర్‌ ఇండెక్స్‌ పెరగడంతో మెటల్స్‌ ధరలు తగ్గాయి. అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 4400 డాలర్ల దిగువకు పడింది. అలాగే రెండు శాతంపైగా నష్టంతో వెండి ట్రేడవుతోంది. ఈనేపథ్యంలో మన MCXలో బంగారం, వెండి భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. బంగారం అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ రూ. 2790లు నష్టంతో రూ. 1,51,670 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ రూ. 2,29,516 వద్ద ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి రరూ. 4325లు నష్టపోయింది. ఒకదశలో వెండి ధర రూ. 228900లకు కూడా పడిపోయింది.