NIFTY TRADE: 15,600పైన నిలబడితేనే?
సింగపూర్ నిఫ్టి దూకుడు చూస్తుంటే నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17600ను దాటేయనుంది. నిఫ్టి క్రితం ముగింపు 17516. నిఫ్టి గనుక 17,640ని దాటుతుందేమో చూడండి. ఈ స్థాయికి వచ్చినా… దాటినా… 17,650 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. గత కొన్ని వారాల నుంచి నష్టాల్లోఉన్న చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు ఇపుడు లాభాల్లోకి వచ్చాయి. మరి అదే స్థాయి లాభాలను నిఫ్టి నిలుపుకుంటుందా అన్నది చూడాలి. నిజానికి నిఫ్టికి 17600 ప్రాంతంలోనే ఒత్తిడి వచ్చే అవకాశముంది. 17,650పైన నిఫ్టి కొనసాగే పక్షంలో నిఫ్టి మరింత బలపడే అవకాశముంది. ఒకవేళ నిఫ్టి అమ్మకాల ఒత్తిడి వస్తే నిఫ్టి తొలుత 17600, 17565 స్థాయిలను చేరొచ్చు. ఇక్కడ నుంచి పడితే మరింత బలహీన పడుతుంది.