NIFTY TRADE: 18,200 దాటితే అమ్మడమే
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు చూస్తుంటే… నిఫ్టి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కన్పించడం లేదు. స్పాట్‌తో పాటు ప్యూచర్స్, ఆప్షన్స్‌లో కూడా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయి. దేశీయ ఇన్వెస్టర్లు ఆదుకుంటున్నారు. కాని ఇదెంత కాలం అన్నది అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి పెరిగితే అమ్మడమనే ఫార్ములా నడుస్తోంది. ఆల్గో ట్రేడింగ్ ప్రకారం ఇవాళ్టికి రేంజ్ 18000 -18220. ఈ మధ్యలో నిఫ్టి కదలాడే అవకాశముంది. 18,240 దాటితే నిఫ్టికి దూసుకుపోవచ్చు. కాని ఆ పరిస్థితి కన్పించడం లేదు. కంపెనీ ఫలితాలు మార్కెట్ అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పుణ్యమా అని అనేక కంపెనీల మార్జిన్టు దెబ్బతింటున్నాయి. కాబట్టి కార్పొరేట్ ఫలితాలు నిఫ్టిని కాపాడటం కష్టం. నిఫ్టి క్రితం ముగింపు 18,125. నిఫ్టి ఇక్కడి నుంచి పెరిగినా 18,220ని దాటకపోవచ్చు. కాబట్టి 20 పాయింట్ల స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. 18240 దాటితే ట్రేడింగ్ చేయొద్దు. ఎల్లుండి నెలవారీ, వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. నిఫ్టిలో జాగ్రత్తగా ఉండండి. నిఫ్టికి తొలి మద్దతు 18,040 వద్ద అందాలి. లేని పక్షంలో 18,000. నిన్నటి క్రితం ముగింపు స్థాయికి వెళితే 17,950కి చేరడం ఖాయం. నిఫ్టి మరీ ఘోరంగా పడే ఛాన్స్ తక్కువ. ఎందుకంటే నిఫ్టి ఓవర్‌బాట్ నుంచి బయటడుతోంది. కాబట్టి దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు రావొచ్చు. నిన్నటి మాదిరే బాగా పడటం, తరవాత కోలుకోవడం. ఇదే ఫార్ములా ఇవాళ కూడా కొనసాగుతుందేమో చూడండి. టెక్నికల్స్ మాత్రం సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి.