NIFTY TRADE: 15,900 దాటితేనే…
ఆసియా మార్కెట్లలో ముఖ్యంగా చైనా టెక్ కంపెనీల్లో వస్తున్న అమ్మకాల ఒత్తిడి ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడుతోంది. అమెరికాలో లిస్టయిన ఈ చైనా కంపెనీలు ఇన్వెస్టర్లు బాగా దెబ్బతీశాయి. దీంతో ప్రపంచ మార్కెట్లలో ఒకవిధమైన స్తబ్దత నెలకొంది. ఇవాళ కూడా చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. సూచీలు పెరుగుతున్నా… అధిక స్థాయిలో లాభాల స్వీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మన నిఫ్టి నిలదొక్కుకోవడం గొప్ప విషయం. నిఫ్టి క్రితం ముగింపు 15,824. సింగపూర్ నిఫ్టి 40 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. కార్పొరేట్ ఫలితాల కారణంగా నిఫ్టి 15870 ప్రాంతంలో నిఫ్టికి తొలి ప్రతిఘటన ఎదురు కావొచ్చు. గత కొన్ని రోజుల నుంచి ఒక ఫార్ములా మార్కెట్లో కొనసాగుతోంది. లాభాల్లో పెరిగితే అమ్మడం, నష్టాల్లో ప్రారంభమైతే కొనుగోలు చేయడం. ఇవాళ కూడా అదే ఫార్ములా. నిఫ్టి గట్టిగా లాభాల్లోనే కొనసాగాలంటే 15900 ఆటాలి. 15890 దాటితే ఈ బ్రేకౌట్‌కు ఛాన్స్ ఉంది. అది ఇవాళ కష్టమే. కాబట్టి నిఫ్టిని 15870 ప్రాంతంలో అమ్మి, స్వల్ప లాభంతో బయటపడటం మంచిది. అన్ని సాంకేతిక అంశాలు సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి. అయితే ఓవర్‌బాట్ నుంచి ఇపుడిపుడే నిఫ్టి బయటపడుతోంది. ఓవర్సోల్డ్లో మాత్రం లేదు. నిఫ్టికి ఇవాళ్టి రేంజ్ 15,780-15,870 మధ్య కదలాడొచ్చు. దిగువ స్థాయికి వస్తే 15,760 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. డే ట్రేడింగ్‌కు పరిమితం అవ్వండి. లాభమైనా, నష్టమైనా ఇవాళే వైదొలగండి. పొజిషనల్ ట్రేడ్‌కు ఇది సమయం కాదు.