లాభాలు స్వీకరించండి
మార్కెట్ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైతే లాభాలు స్వీకరించమని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టి క్రితం ముగింపు 18027. సింగపూర్ నిఫ్టి 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18150ని తాకే అవకాశముంది. ఇదేస్థాయికి చేరే పక్షంలో లాభాలు స్వీకరించడం మంచిదని సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ఎడిటర్ అనూజ్ సింఘాల్ అంటున్నారు. గత శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలు చేసినా.. దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. ప్రస్తుత విదేశీ ఇన్వెస్టర్ల లాంగ్ పొజిషన్ 53 శాతం ఉందని, ఈ స్థాయిలో నిఫ్టి భారీగా పెరిగే ఛాన్స్ తక్కువని అన్నారు. దీంతో అధిక స్థాయిలో లాభాలు స్వీకరించడం మంచిదని అన్నారు. అలాగే పుట్ కాల్ రేషియో కూడా 1.12 నుంచి 0.83 శాతానికి చేరిందన్నారు. 18100 పుట్, 18200 కాల్ వద్ద ఓపెన్ ఇంటరెస్ట్ అధికంగా ఉంది. 18200ని నిఫ్టి క్రాస్ చేయడం ఇవాళ కష్టంగా ఉండొచ్చని అనూజ్ తెలిపారు. కొత్త ఏడాది సందర్భంగా చైనా, హాంగ్ కాంగ్ మార్కెట్లకు సెలవు.