For Money

Business News

స్విగ్గీ ఐపీఓకు గ్రీన్‌ సిగ్నల్‌

జొమాటో తరవాత మరో ఫుడ్‌ డెలివరీ అగ్రిగేటర్‌ ప్రైమరీ మార్కెట్‌కు రానుంది. ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ. 10,500 కోట్లను (125 కోట్ల డాలర్లను) సమీకరించేందుకు ఉద్దేశించిన ఐపీఓకు మార్కెట్‌ రెగ్యులేటర్ సెబి ఆమోదం తెలిపింది. అప్‌డేటెడ్‌ ప్రాస్పెక్టస్‌ను స్విగ్గీ ఇవాళ అప్‌లోడ్‌ చేసింది. ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కోసం 21 రోజులు ఉంచనుంది. ప్రతిపాదిత పబ్లిక్‌ ఆఫర్‌లో భాగంగా తాజా షేర్ల జారీ ద్వారా రూ. 3750 కోట్లను సమీకరిస్తారు. మరో 6,664 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ వాటాలో కొంత భాగాన్ని ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో భాగంగా విక్రయిస్తారు. వాటాను అమ్మనున్న ఇన్వెస్టర్లలో ప్రొసస్‌, సాఫ్ట్‌బ్యాంక్‌ కూడా ఉన్నాయి. ఒక్కో షేర్‌ ఆఫర్‌ ధరను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది. స్విగ్గీకి ప్రధాన పోటీదారు అయిన జొమాటో గత ఏడాది పబ్లిక్‌ ఇష్యూను జారీ చేసిన విషయం తెలిసిందే. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో రూ. 5,476 కోట్ల టర్నోవర్‌పై రూ. 1,600 కోట్ల నష్టాన్ని స్విగ్గీ పొందింది. జొమాటో కూడా నష్టాలతోనే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. ఇప్పటికీ ఆ కంపెనీ నష్టాల్లోనే ఉంది. కాకపోతే నష్టాలను బాగా తగ్గించుకుంది.