For Money

Business News

ఇంకా డేటా అందాల్సి ఉంది

అదానీ – హిండెన్‌బర్గ్‌కు సంబంధించిన దర్యాప్తు ఓ కొలిక్కి వస్తోందని సుప్రీం కోర్టుకు సెబీ తెలిపింది. సుప్రీం ఆదేశాల మేరకు 24 అంశాలపై సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన స్టేటస్‌ రిపోర్ట్‌ను సెబీ ఇవాళ సుప్రీం కోర్టుకు సమర్పించింది. 22 అంశాలలో దర్యాప్తు తుది దశకు చేరిందని, మరో రెండింటిపై తాత్కాలిక నివేదిక రెడీగా ఉందని పేర్కొంది. రెండు దర్యాప్తు అంశాలకు సంబంధించి విదేశీ సంస్థల నుంచి సమాచారం అందాల్సి ఉందని పేర్కొంది. దర్యాప్తులో తేలిన అంశాలపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా సెబీ స్పష్టం చేసింది. ఇపుడు చేపట్టిన దర్యాప్తులో విదేశాల్లోని 13 అదానీ కంపెనీలను దర్యాప్తు చేయాల్సి ఉందని సెబీ తెలిపింది. ఇవన్నీ నల్లధనం దాచుకునేందుకు స్వర్గధామాలుగా పేర్కొనే దేశాల్లో ఉన్నట్లు సెబీ పేర్కొంది.