For Money

Business News

మెరిసిన జియో ఫైనాన్స్‌

ఇవాళ నిఫ్టి గ్రీన్‌లోనే ఉన్నా… రోజంతా ఒడుదుడుకులకు లోనైంది. రిలయన్స్‌ ఇవాళ కూడా ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. ఏజీఎం చాలా చప్పగా సాగడంతో ఈ షేర్‌లో ఇన్వెస్టర్ల నుంచి ఎలాంటి ఆసక్తి కన్పించలేదు. అయితే జియో ఫైనాన్స్‌కు గట్టి మద్దతు లభించింది. కంపెనీ బీమా రంగంలో కూడా ప్రవేశిస్తుందని రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో ఆసక్తి కనబర్చారు. ఇక ఇతర షేర్లలో పెద్ద మార్పు లేదు. ఆరంభంలోనే లాభాలను పోగొట్టుకున్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో కోలుకున్నా… రెండు తరవాత మళ్ళీ లాభాలు కరిగిపోయాయి. చివర్లో కోలుకోవడంతో నిఫ్టి 36 పాయింట్ల లాభంతో 19342 పాయింట్ల వద్ద ముగిసింది. 19350పైన క్లోజ్‌ కాకపోవడంతో టెక్నికల్‌ అనలిస్టులు నిఫ్టి ఇంకా డేంజర్‌ జోన్‌లోనే ఉందని అంటున్నారు. నిన్నటి నుంచి ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు దూసుకుపోతున్నా… మన మార్కెట్‌లో ఎలాంటి ఉత్సాహం కన్పించడం లేదు.