For Money

Business News

భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి

నిఫ్టి ప్రధాన షేర్లలో భారీ ఒత్తిడి రావడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ తీవ్రంగా దెబ్బతింది. రాత్రి అమెరికా మార్కెట్ల భారీ పతనం తరవాత ఆసియా మార్కెట్లు కూడా అదే స్థాయిలో నష్టపోయాయి. జపాన్‌ నిక్కీ రెండు శాతం క్షీణించగా, చైనా.. హాంగ్‌కాంగ్ మార్కెట్లదీ అదే తీరు. ఉదయం 19297 వద్ద ప్రారంభమైన నిఫ్టి… మిడ్‌ సెషన్‌లో స్వల్పంగా కోలుకున్నట్లు కన్పించినా… క్లోజింగ్‌కల్లా మళ్ళీ అంతకన్నా దిగువకు పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 120 పాయింట్ల నష్టంతో 19265 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టిలో 40 షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టిలో కూడా ప్రధాన షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ రెండు సూచీలకన్నా ఇటీవల బాగా పెరిగిన నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్ క్యాప్‌ సూచీలు ఒక శాతం దాకా క్షీణించాయి. జియో ఫైనాన్స్‌ ఇవాళ లాభాల్లో క్లోజ్‌ కావడం విశేషం. నిన్నటి వరకు లోయర్‌ సీలింగ్‌లో క్లోజైన ఈ షేర్‌ ఇవాళ రూ. 202.8 వద్ద ఓపెన్‌ అయింది. ఒకదశలో 2024ని తాకి… చివర్లో 8 శాతం లాభంతో రూ. 221.60 వద్ద ముగిసింది.ఈ షేర్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 1.40 లక్షల కోట్లు ఉండటం విశేషం.