For Money

Business News

19400 దిగువన క్లోజైన నిఫ్టి

ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి… వెంటనే ఆరంభ లాభాలను కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా… డెరివేటివ్స్‌ క్లోజింగ్ కారణంగా ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడి మొదలైంది. కొన్ని కౌంటర్లలో లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి మిడ్‌ సెషన్‌ ఆరంభానికల్లా నష్టాల్లోకి జారుకుంది. చివరల్లో ఒత్తిడికి గురైనా బ్యాంక్‌ నిఫ్టి స్థిరంగా ముగిసింది. అయితే నిఫ్టి మాత్రం 57 పాయింట్ల నష్టంతో 19,386 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి 200 పాయింట్లు తగ్గి 19386 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్నటి దాకా భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి నెక్ట్స్‌, మిడ్‌ క్యాప్‌ నిఫ్టి సూచీలు ఇవాళ స్వల్ప లాభంతో అంటే 0.3 శాతం లాభంతో ముగిశాయి. నిఫ్టిలో 15 షేర్లు గ్రీన్‌లో క్లోజ్‌ కాగా, 35 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ రిలయన్స్‌ బలహీనంగా ట్రేడింగ్‌. లిస్టింగ్‌ తరవాత జియో ఫైనాన్స్‌ ఇవాళ కూడా లోయర్‌ సీలింగ్‌తో ముగిసింది. ఓపెనింగ్‌లోనే 213.45ని తాకగా.. కొనుగోలుదారులు ఎవరూ లేరు. అయితే ఇవాళ ఈ కౌంటర్‌లో 2.76 కోట్ల షేర్లు ఈ ధర వద్ద చేతులు మారాయి.