For Money

Business News

ప్రైవేట్‌ సంస్థల్లో రిజర్వేషన్లపై ఆదేశం

ప్రైవేట్‌ కంపెనీల్లో కూడా 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలంటూ ఇటీవల హర్యానా ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ప్రైవేట్‌ సంస్థలు హర్యానా, పంజాబ్‌ హైకోర్టును ఆశ్రయించారు. సదరు చట్టం అమలుపై హైకోర్టు స్టే మంజూరు చేసింది. దీనిపై హర్యానా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తన వాదనను వినిపించేందుకు తగిన సమయం ఇవ్వకుండా హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందని ఆరోపింది. దీనికి స్పందించిన సుప్రీం కోర్టు… హైకోర్టు విధించిన స్టేని ఎత్తివేస్తూ… అన్ని పిటీషన్లపై సమగ్ర వాదనలు విన్న తరవాత తీర్పు ఇవ్వాలని పేర్కొంది. నెలలోపు ఈ వ్యవహారాన్ని తేల్చమని పేర్కొంది. వాయిదాలు వేయొద్దని పేర్కొంది. ఈలోగా కొత్త చట్టం మేరకు రిజర్వేషన్లు పాటించని సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం.. రాజ్యాంగబద్ధతను తేల్చాల్సి ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.