For Money

Business News

రూ. 25000 కోట్ల షేర్ల అమ్మకం

వచ్చే వారం ఎస్బీఐ క్యూఐపీ ఇష్యూ జారీ చేయనుంది. సుమారు రూ. 25,000 కోట్ల విలువైన షేర్లను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు అమ్మనుంది. ఈ డీల్‌ వచ్చే వారం పూర్తి కానుంది. క్యూఐపీ ఇష్యూ గనుక పూర్తిగా సబ్‌స్క్రయిబ్‌ అయితే ఇప్పటి వరకు వచ్చిన అతి పెద్ద క్యూఐపీ ఇదే అవుతుంది. గతంలో అంటే 2015లో ఇలాంటి ఇష్యూ ద్వారా కోల్‌ ఇండియా రూ. 22,560 కోట్లను సమీకరించింది. రుణాల వితరణ పెంచేందుకు ఎస్‌బీఐ ఈ స్థాయిలో నిధులు సమీకరించనుందని బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ పేర్కొంది.