For Money

Business News

సంజీవ్‌ భాసిన్‌ టాప్‌ పిక్స్‌

ఈవారంలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు మూడు షేర్లను ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ భాసిన్‌ రెకమెండ్‌ చేశారు. ఎకనామిక్‌ టైమ్స్‌తో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వారానికి, 2024 ఏడాది కోసం కూడా ఈ షేర్లలో ఇన్వెస్ట్‌ చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. అశోక్‌ లేలాండ్‌ ఆయన సూచించిన తొలి పిక్‌. ఈ షేర్‌ ఇపుడు రూ. 174 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ను రూ. 230 లేదా రూ. 250 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. దేశీయ మార్కెట్‌లో ముఖ్యంగా కమర్షియల్‌ వాహనాల మార్కెట్‌లో ఈ కంపెనీ వాటా పెరుగుతోందని ఆయన చెప్పారు. టాటా మోటార్స్‌ వాటాను అశోక్‌ లేల్యాండ్ ఆక్రమిస్తోందని కూడా ఆయన తెలిపారు. కంపెనీ ఇంటర్నల్‌ కంబూస్టన్‌ కమ్యూనికేషన్‌ విభాగం కూడా బాగా రాణిస్తోందని అన్నారు. 2024 కోసం కూడా ఈ షేర్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చని అన్నారు. ఆయన సూచించిన మరో షేర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగంలో అద్భుతంగా రాణిస్తున్న ఈ బ్యాంక్‌ నిమ్స్‌ పరిశ్రమలోనే అత్యధికమని అన్నారు. ప్రస్తుతం ఈ బ్యాంక్‌ షేర్‌ రూ. 995 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ను రూ. 1250 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయొచ్చని అన్నారు. లార్జ్‌ క్యాప్‌ షేర్లలోని ఈ షేర్‌ గత ఆరు నెలల్లో పెద్దగా రాణించలేదన్నారు. ఇక సంజీవ్‌ భాసిన్‌ సూచించిన మూడో షేర్‌ డీసీబీ బ్యాంక్‌. ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ ప్రమోట్‌ చేసిన ఈ బ్యాంక్‌ ప్రస్తుతం రూ. 125 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ షేర్లను ప్రమోటర్లు ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో రూ. 137 వద్ద ఒక్కో షేరును కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రమోటర్లు సమకూర్చిన తాజా పెట్టుబడితో బ్యాంక్‌ మరింత బాగా రాణిస్తుందని భాసిన్‌ అన్నారు. 2024లో ఈ షేర్‌ స్టార్‌ షేర్‌గా మారే అవకాశముందని, రూ. 200 టార్గెట్‌ను ఈ బ్యాంక్‌ సాధిస్తుందని అన్నారు.