For Money

Business News

పెట్టుబడి రూ. 13,750, లాభం రూ. 13,522

ఊహించినట్లు మోతీసన్స్‌ జువెలర్స్‌ ఇన్వెస్టర్లకు అద్భుత ప్రతిఫలాన్ని అందించింది. కేవలం ఆరు రోజుల్లో ఈ ఐపీఓలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు జాక్‌పాట్‌ కొట్టారు. ఒక్కో లాట్‌పై రూ. 13,750 పెట్టుబడి పెట్టగా ఇవాళ రూ.13,522 లాభం వచ్చింది.
మోతీసన్స్‌ జువెల్లర్స్‌ షేర్‌ ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.55తో పోలిస్తే 98 శాతం ప్రీమియంతో ఈ షేర్లు లిస్టయ్యాయి. బీఎస్‌ఈలో 88.90 శాతం లాభంతో రూ.103.90 వద్ద… ఎన్‌ఎస్‌ఈలో షేరు 98.18 శాతం భారీ ప్రీమియంతో రూ.109 వద్ద షేర్లు లిస్టయ్యాయి. ఒకదశలో ఈ షేర్లు మరింత పుంజుకుని 93 శాతానికి చేరాయి. ప్రైమరీ మార్కెట్‌లో మోతీసన్స్‌ జువెలర్స్‌ ఐపీఓకు విశేష ఆదరణ లభించింది. ఈ ఆఫర్‌ ఏకంగా 159 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. షేర్‌ ధర రూ.55కు అలాట్‌ చేసింది. ఈ ఇష్యూ ఈ నెల 20న క్లోజ్‌ కాగా, ఇవాళ లిస్టయ్యాయి. ఇవాళే లిస్టయిన మరో ఐపీఓలు మాత్రం ఇన్వెస్టర్లకు నిరాశను మిగిల్చాయి. సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌ షేర్ల ఇష్యూ ధర రూ.360 కాగా… ఎన్‌ఎస్‌ఈలో రూ.340 దగ్గర లిస్టయింది. తరవాత రూ. 324ని తాకి.. క్లోజింగ్‌లో రూ. 334 వద్ద స్థిరపడింద.ఇ
ముత్తూట్‌ మైక్రోఫిన్‌ లిమిటెడ్‌ షేర్లు కూడా డిస్కౌంట్‌కు లిస్టయ్యాయి. ఈ షేర్‌ ఇష్యూ ధర రూ.291 కాగా… ఎన్‌ఎస్‌ఈలో రూ.275.30 వద్ద లిస్టయింది. ఇవాళ్టి కనిష్ఠ స్థాయి రూ. 265.95 వద్ద ముగిసింది.