For Money

Business News

21,400 పైన నిఫ్టి

స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ రన్‌ కొనసాగుతోంది. సూచీలు కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను తాకుతున్నాయి. ఇవాళ ఉదయం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభమైనా.. ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ మార్కెట్‌ పుంజుకుంది. చాలా వరకు అంతర్జాతీయ మార్కెట్లు క్రిస్మస్‌ సందర్భంగా సెలవులో ఉన్నాయి. ఉదయం చైనా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ట్రేడైనా… మన మార్కెట్లు పట్టించుకోలేదు. అమెరికాలో వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరాయని… ద్రవ్యోల్బణ రేటు తగ్గుతుండటంతో… ఊహించిన టైమ్‌ ఫ్రేమ్‌ కంటే ముందే వడ్డీ రేట్లను ఫెడ్‌ తగ్గించవచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో మన మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగ్గా ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మార్కెట్‌ దాదాపు గరిష్ఠస్థాయికి వచ్చిందని… ఇక భారీగా పెరగడం ఉండదని… కన్సాలిడేషన్‌ మోడ్‌లోకి నిఫ్టి వెళ్ళవచ్చని మరొకొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌ విషయానికొస్తే… నిఫ్టీ 21,365 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 21,477
స్థాయికి చేరింది. తరవాత స్వల్పంగా తగ్గింది 92 పాయింట్లు లాభంతో 21,441 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్‌ 230 లాభంతో 71,336 వద్ద ముగిసింది.
నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో దివీస్‌ నిలబడింది. ఈ షేర్‌ ఇవాళ ఏకంగా 4.55 శాతం లాభంతో రూ. 3863 వద్ద ముగిసింది. ఇక హీరోమోటొ కార్ప్‌, అదానీ ఎంటర్‌ప్రైజస్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ షేర్లు రెండు శాతంపైగా లాభంతో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ ఇవాళ నిఫ్టిలో టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఇన్ఫోసిస్‌ ఇవాళ ఒక శాతం నష్టంతో ముగిసింది. ఇక సెన్సెక్స్‌-30 సూచీ విషయానికొస్తే ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, విప్రో, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, టైటన్‌, నెస్లే ఇండియా షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. అలాగే బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.