సంజీవ్ భన్సల్ టాప్ పిక్
ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్ భన్సల్ ఇవాళ్టి ట్రేడింగ్‌కు హిందాల్కోషేర్‌ను రికమెండ్ చేస్తున్నారు. చైనా మార్కెట్లు మళ్ళీ ప్రారంభమైనందున అల్యూమినియం ధరలు పెరుగుతాయని ఆయన అంటున్నారు. హిందాల్కో షేర్ చాలా ఆకర్షణీయ ధర వద్ద లభిస్తోందని… రూ. 365 టార్గెట్‌గా ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. అలాగే మరో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జై ఠక్కర్ ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లను రెకమెండ్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్‌ను రూ. 1470 టార్గెట్ కోసం కొనుగోలు చేయాలని.. స్టాప్‌లాస్ రూ. 1391గా ఆయన పేర్కొన్నారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ షేర్‌ను కూడా రూ. 710 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని ఆయన సిఫారసు చేస్తున్నారు.ఈ షేర్‌కు ఆయన ఇచ్చిన స్టాప్‌లాస్‌రూ. 672.