సాగర్ సిమెంట్స్ షేర్ల విభజన
హైదరాబాద్ కంపెనీ సాగర్ సిమెంట్స్ షేర్లను విభజించింది. 1:5 నిష్పత్తిలో రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లను రూ.2 ముఖ విలువ కలిగిన షేర్లుగా విభజింజినట్లు కంపెనీ వెల్లడించింది. సామర్థ్య విస్తరణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.75 కోట్ల పెట్టుబడులు పెట్టామని.. రెండో త్రైమాసికంలో మరో రూ.150 కోట్లు వెచ్చించనున్నామని కంపెనీ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సెప్టెంబరు నాటికి 25 లక్షల టన్నుల అదనపు సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని చెపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా ప్లాంటను ఏర్పాటు చేయడం లేదా ఉన్న వాటిని కొనుగోలు చేయడమా అనే అంశంపై స్పష్టత రావడం లేదన్నారు.