డాలర్ బదులు క్రిప్టో… రష్యా
క్రమంగా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని రష్యా నిర్ణయించింది. విదేశీ వాణిజ్యంతో సహా అనేక రకాల వ్యాపారాల్లో డాలర్ కరెన్సీనే రష్యా ఉపయోగిస్తోంది. డాలర్‌పై ఆధారపడటం తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు రష్యా విదేశాంగ డిప్యూటీ మంత్రి అలెగ్జాండర్ పన్కిన్ అన్నారు. డాలర్ స్థానంలో క్రిప్టో కరెన్సీ వంటి డిజిటల్ కరెన్సీని తీసుకు రావాలని భావిస్తున్నామని ఆయన అన్నారు. దీర్ఘకాలంలో డాలర్ బదులు ఇతర కరెన్సీలు, క్రిప్టో కరెన్సీలు తేవాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనివల్ల మున్ముందు అమెరికా ఆంక్షలు విధించినా రిస్క్ తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.