15 నెలల కనిష్ఠానికి రూపాయి
విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) మార్కెట్లో డాలర్ తో రూపాయి పతనం నాలుగో రోజూ కొనసాగింది. నిన్న స్పాట్ మార్కెట్లో 75.67 వద్ద ముగిసింది. రూపాయి పతనం ఇంకా కొనసాగుతుందని, ఈ ఏడాదిలో 77కు చేరుతుందని ఫారెక్స్ మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతేడాది(202) ఏప్రిల్‌లో రూపాయి 76.87 స్థాయి వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈ స్థాయికి మించి రూపాయి పతనం కానుందన్నమాట. క్రూడ్ ధరలు మూడేళ్ళ గరిష్ఠానికి చేరడం, అలాగే డాలర్ కూడా ఏడాది గరిష్ఠానికి చేరడంతో డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లో ఏమాత్రం అమ్మకాల ఒత్తిడి వచ్చినా రూపాయి పతనం మరింత స్పీడుగా ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.