షేర్‌పై ఫలితాల ఒత్తిడి
ఏషియన్ పెయింట్స్ మార్కెట్‌ను తీవ్ర నిరాశపర్చింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ పనితీరు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ కంపెనీ రెండో త్రైమాసికంలో కంపెనీ పనితీరు పెరిగినా… నికర లాభం భారీగా క్షీణించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 8457 కోట్ల అమ్మకాలపై రూ. 782 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఆదాయం 19 శాతం పెరగ్గా, నికర లాభం 31 శాతం క్షీణించింది. మార్కెట్ రూ. 8795 కోట్ల టర్నోవర్‌పై రూ. 1076 కోట్ల నికర లాభాన్ని ఆశించింది. ఈ లెక్కన కంపెనీ రెండు అంశాల్లోనూ మార్కెట్‌ను నిరాశపర్చింది. బోర్డు రూ. 4.40 చొప్పున తాత్కాలిక డివిడెండ్‌కు కంపెనీ ప్రతిపాదించింది. వడ్డీ, పన్నులు, తరుగులతో పాటు ఇతర ఖర్చులు 36 శాతం పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ముడి పదార్థాల వ్యయం 8 శాతం పెరగడం మరో కారణం. ఇతర ఆదాయం కూడా 31 శాతం క్షీణించింది. రానున్న మూడేళ్ళలో కంపెనీ రూ. 2650 కోట్లతో కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పనుంది.