కొనసాగుతున్న ర్యాలీ
అంతర్జాతీయ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ కొనసాగుతోంది. ఒక్క బాండ్స్ తప్ప అన్ని రకాల మార్కెట్లలో ర్యాలీ కన్పిస్తోంది. ఈక్విటీ, కరెన్సీ, బేస్ మెటల్స్, క్రూడ్ ఆయిల్, బులియన్… అన్ని మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి. నిఫ్టి ప్రస్తుతం 17251 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 364 పాయింట్లు పెరిగింది. యూరో మార్కెట్లు ఇవాళ కూడా సగటున రెండు శాతంపైగా లాబపడ్డాయి. యూరోస్టాక్స్ 50 సూచీ 2.28 శాతం లాభంతో ఉంది. రాత్రి రెండు శాతంపైగా పెరిగిన అమెరికా మార్కెట్లు ఇవాళ కూడా ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. అమెరికా ఫ్యూచర్స్ ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. సో… నిఫ్టి 17200పైన క్లోజ్ కావడం ఖాయంగా కన్పిస్తోంది. రేపు దసరా సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఎల్లుండి వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. కాబట్టి ఇన్వెస్టర్లు జాగ్రత్త పడే అవకాశముంది.