రిలయన్స్ చేతికి వాల్ట్ డీస్నీ ఇండియా?
త్వరలోనే దేశ వినోద రంగంలో అతి పెద్ద డీల్ కుదరనుంది. వాల్ట్ డిస్నీ భారత ఆపరేషన్స్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చేజిక్కించుకోనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 66,500 కోట్లు ఉంటుందని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. డీల్ విలువ రూ. 83,000 కోట్లు ఉండొచ్చని మరికొన్ని వర్గాలు
అంటున్నాయి. భారత ఆపరేషన్స్‌ను అమ్మేయాలని వాల్ట్ డిస్నీ నిర్ణయించింది. దీంతో వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. మొన్నటి దాకా సోని చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రిలయన్స్‌తో జరిపిన చర్చలు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. డీల్ కుదిరినా… కొత్త కంపెనీలో వాల్ట్ డిస్నీకి మైనారిటీ వాటా ఉంటుందని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. డీల్ కుదిరితే రిలయన్స్ చేతికి డిస్నీ స్టార్‌లో మెజారిటీ వాటా దక్కే అవకాశముంది. వాటాలతో పాటు నగదు లావాదేవీలు ఈ డీల్ ఉంటాయని భావిస్తున్నారు. వ్యాల్యూయేషన్‌కు సంబంధించి రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయని… తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.