ఫ్యూచర్స్ స్టోర్స్‌లో రిలయన్స్ షాపులు
కోర్టు వివాదాలు నడుస్తున్నా ఫ్యూచర్స్ స్టోర్స్‌ను తన ఆధీనంలో తీసుకున్న రిలయన్స్ రీటైల్..ఇపుడు అక్కడ తన షో రూమ్‌లను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటిదాకా 950 ఫ్యూచర్ స్టోర్లను రిలయన్స్ స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన సబ్ లీజులను రద్దు చేస్తూ ఫ్యూచర్‌కు రిలయన్స్ రిటైల్ నోటీసులను జారీ చేసింది. 835 ఫ్యూచర్ రిటైల్, 112 ప్యూచర్ లైఫ్ స్టైల్ స్టోర్ల సబ్ – లీజుల రద్దుకు సంబంధించిన నోటీసులను అందుకుంటున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు వెల్లడించాయి. లీజు అద్దెలను చెల్లించలేని ఫ్యూచర్ స్టోర్లను గత నెలలో స్వాధీనం చేసుకుని.. వాటిని మళ్ళీ ప్యూచర్ గ్రూప్‌నకు సబ్ – లీజుకు ఇచ్చారు. ఇపుడు ఆ సబ్ లీజ్‌లను రద్దు చేసి.. వాటి స్థానంలో రిలయన్స్ తన స్టార్లను ప్రారంభించనుంది. న్యూజిలాండ్ డెయిరీ సంస్థ ఫాంటెర్రాతో కుదుర్చుకున్న సంయుక్త సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ నకే చెందిన ఫ్యూచర్ కన్జూమర్ ప్రకటించింది.