For Money

Business News

రిలయన్స్‌ నికర లాభం డౌన్‌

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 16,563 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికరలాభం రూ. 17,394 కోట్లు. అయితే ఇదే కాలంలో కంపెనీ టర్నోవర్‌ మాత్రం కేవలం 0.2 శాతం తగ్గి రూ. 2.35 లక్షల కోట్లకు చేరింది. కంపెనీ ఎబిటా (EBITDA) రెండు శాతం తగ్గి రూ. 40, 968కోట్ల నుంచి రూ. 39,058 కోట్లకు చేరింది. అలాగే ఎబిటా మార్జిన్స్‌ కూడా 17.7 శాతం నుంచి 16.9 శాతానికి చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీకి అధిక రుణభారం ఉన్నందున ఫైనాన్స్‌ వ్యయం 5 శాతం పెరిగి రూ. 6017 కోట్లకు చేరింది.