సబ్‌వేపై రిలయన్స్ కన్ను!
దేశంలోని సబ్ వే స్టోర్స్‌ను టేకోవర్ చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీ భావిస్తోంది. దేశంలో దాదాపు 600పైగా సబ్‌వే స్టోర్స్ ఉన్నాయి. భారత్‌లోని యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికా సంస్థతో రిలయన్స్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డీల్ రూ. 1500 కోట్ల నుంచి రూ. 1900 కోట్ల మధ్య ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR బిజినెస్‌పై రిలయన్స్ కన్నేయడం ఇదే మొదటిసారి. స్థానిక ఫ్రాంచైజీలతో కలిసి అమెరికా సంస్థ భారత్‌లో సబ్ వే స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా కంపెనీ వ్యాపారాన్ని పునర్ వ్యవస్థీకరించాలని అమెరికా కంపెనీ భావిస్తోంది. డీల్ కుదిరితే రిలయన్స్ రీటైల్ వీటిని చేజిక్కించుకుంటుంది. రిలయన్స్ ఈ రంగంలోకి దిగితే డొమినొస్ పిజ్జా, మెక్‌డొనాల్డ్స్, బర్జర్ కింగ్, పిజ్జా హట్, స్టార్ బక్స్ మధ్య పోటీ పెరుగుతుంది.