For Money

Business News

నిరాశ పర్చిన రిలయన్స్

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పనితీరు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నా… నికర లాభం మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 15,138 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 16,011 కోట్లు. అయితే గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 18,951 కోట్లు. అంటే మూడు నెలల్లో కంపెనీ నికర లాభం ఏకంగా రూ. 4 వేల కోట్ల మేరకు తగ్గిందన్నమాట. ఆదాయం మాత్రం రూ. 75,630 కోట్లుగా నమోదైంది.గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 69,962 కోట్లు. కాని మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ. 76,683 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఈ లెక్కన చూస్తే జూన్‌ త్రైమాసికంలో టర్నోవర్‌ కూడా స్వల్పంగా తగ్గింది. దీంతో మార్జిన్‌ 7.6 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది. చమురు విభాగం ఈ త్రైమాసికంలో బాగా రాణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడమే దీనికి కారణం.