థర్మల్ విద్యుత్‌లోకి రిలయన్స్
గ్రీన్ ఎనర్జి రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా ప్రవేశించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ల్యాంకో అమర్కంటక్ థర్మల్ పవర్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ కూడా పోటీపడుతోంది. ఆర్ఐఎల్తో పాటు అదానీ గ్రూప్ కూడా ఇందుకోసం బిడ్ వేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ యూనిట్ కోసం బిడ్ వేశాయి. అందరికంటే అధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1,960 కోట్లు అప్ఫ్రంట్గా చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు అదానీ గ్రూప్ బాండ్ల రూపంలో రూ.1,800 కోట్లు ఆఫర్ చేసిందని.. పీఎఫ్సీ-ఆర్ఈసీ కన్సార్షియం 20 ఏళ్లలో రూ.3,400 కోట్ల చెల్లింపులతో పాటు ఈ పవర్ ప్లాంట్‌కు రుణాలిచ్చిన వారికి 40 శాతం వాటా కూడా ఆఫర్ చేసినట్లు తెలిసింది.