అమ్మకానికి రాజస్థాన్ రాయల్స్ వాటా?

ఐపీఎల్ టీమ్ అయిన రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఈ ఫ్రాంచైజీ ఓనర్లలో ఒకరైన రెడ్ బర్డ్ క్యాపిటల్ తన వాటాను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య సంస్థ అయిన ఎమర్జింగ్ మీడియా వెంచర్స్‌లో 3.75 కోట్లకు డాలర్లకు రెడ్‌బర్డ్ కొనుగోలు చేసింది. ఈ డీల్ జరిగింది నాలుగేళ్ళ క్రితం. అపుడు రాజస్థాన్ రాయల్స్ వ్యాల్యుయేషన్ 25 కోట్ల డాలర్లను. ఇపుడు ఈ ఫ్రాంచైజీ విలువ రెట్టింపు అయింది. తన వాటాను అమ్మడానికి ఇదే సరైన సమయమని రెడ్ బర్డ్ భావిస్తోంది. గోల్డ్‌మన్ శాచ్స్ మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన గ్యారీ కార్డినల్ రెడ్ బర్డ్‌ను స్థాపించారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్రికెట్ టీమ్‌లకు మంచి గిరాకి ఉంది. పైగా భారత్‌తో పాటు కరేబియన్ అండ్ సౌత్ ఆఫ్రికాలో కూడా రెడ్‌బర్డ్‌కు ఫ్రాంచైజీ ఉంది. మరి రెడ్ బర్డ్ వాటాను ఎవరు కొనుగోలు చేస్తారో చూడాలి.