For Money

Business News

వాల్‌స్ట్రీట్‌లో రికవరీ

నిన్న భారీ నష్టాలతో ముగిసిన టెక్‌, ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇటీవల బాగా దెబ్బతిన్న టెస్లా, ఎన్‌విడా షేర్లు ఇవాళ ఒక మోస్తరు లాభాలతో ఉన్నాయి. దీంతో నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు అర శాతం దాకా లాభాల్లో ఉన్నాయి. డౌజోన్స్ లాభాలు కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రతికూలంగా ఉండటంతో డాలర్‌ కాస్త చల్లబడింది. అయినా 107పైనే డాలర్‌ ఇండెక్స్‌ ట్రేడవుతోంది. అయితే క్రూడ్‌ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 72 డాలర్ల వద్ద ఉంటోంది. అలాగే బులియన్‌ మార్కెట్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఔన్స్‌ బంగారం ధర అమెరికా మార్కెట్‌లో 2860 డాలర్లకు పడింది. అలాగే వెండి కూడా ఒకటిన్నర శాతం తగ్గింది.