జీఎస్టీ కలెక్షన్స్‌లో రికార్డు
జీఎస్టీ కలెక్షన్స్‌లో కొత్త రికార్డు. జీఎస్టీ ప్రవేశ పెట్టిన తరవాత ఎన్నడూ లేనివిధంగా మార్చి నెలలో రూ.1.42 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఫిబ్రవరిలో రూ. 1.33 లక్షల కోట్లు వసూలైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలతో పోలిస్తే రూ. 9 లక్షల కోట్లు పెరిగాయన్నమాట.ఆర్థిక సంవత్సరంలో చివరి నెల కావడంతో అనేక పెండింగ్ మొత్తాలన్ని వసూలు అయ్యాయి.