నష్టాల్లోకి ఆర్బీఎల్ బ్యాంక్
ప్రైవేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 459 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ. 141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఎన్పీఏ ప్రావిజన్స్ బాగా పెరగడంతో కంపెనీ నష్టాలు ప్రకటించాల్సి వచ్చింది. కోవిడ్–19 నేపథ్యంలో స్థూల రాని బాకీలు 97 శాతం పెరిగి రూ. 1,342 కోట్లకు చేరాయి. గత ఏడాది క్యూ1తో పోలిస్తే ఎన్పీఏలు 3.45 శాతం నుంచి 4.99 శాతానికి పెరిగాయని బ్యాంక్ వెల్లడించింది. దీంతో మొత్తం ప్రావిజన్లు రూ. 500 కోట్ల నుంచి రూ. 1,425 కోట్లకు చేరాయి. ఈ ప్రావిజన్స్ బెడద లేకుంటే బ్యాంకు లాభాలు ప్రకటించేది.