For Money

Business News

ప్రభావం చూపని క్రెడిట్‌ పాలసీ

ఆర్బీఐ ఇవాళ ప్రకటించిన క్రెడిట్‌ పాలసీ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పావు శాతం వడ్డీ తగ్గింపును మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ చేసింది. ఆర్బీఐ ప్రసంగంలోనూ ఎలాంటి స్పెషల్‌ లేకపోవడంతో మార్కెట్‌ నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో నిఫ్టి 23443 పాయింట్లను తాకినా తరవాత కోలుకుని 23559 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 43 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇతర సూచీల్లో కొన్ని లాభాల్లో ముగిసినా.. అవి కూడా నామ మాత్రమే. మార్కెట్‌ పూర్తిగా కార్పొరేట్‌ ఫలితాలకే పరమితమైంది. ఫలితాలు బాగున్న కంపెనీలకే మద్దతు లభిస్తోంది. స్పెక్యులేషన్‌ చాలా వరకు తగ్గింది. ఇవాళ 2895 షేర్లు ట్రేడవగా, 1756 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ మెటల్‌ షేర్ల సూచీ 2.5 శాతం దాకా లాభపడింది. టాటా స్టీల్‌తో పాటు ఇతర స్టీల్‌ షేర్లు పెరిగాయి. భారీ నష్టాల నుంచి ట్రెంట్‌ మూడు శాతం మేరకు కోలుకోవడం విశేషం. ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో ఐటీసీ నిఫ్టిలో టాప్‌ లూజర్‌గా మారింది.