HDFC Bank-ఆర్బీఐ క్లారిటీ?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పనితీరు భేషుగ్గా ఉందని ఆర్బీఐ వర్గాల వెల్లడించాయి. బ్యాంక్ ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదని, బ్యాంక్ సీనియర్ ఉద్యోగులతో విభేదాల కారణంగానే అతను చక్రవర్తి రాజీనామా చేశారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. అది పూర్తిగాఅతను చక్రవర్తి వ్యక్తిగత నిర్ణయని ఈ వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘన ఎక్కడా జరగలేదని, బ్యాంక్ పనితీరుపై ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశాయి. బ్యాంక్‌లో గవర్నెస్ సమస్యలు లేవని చట్టపరంగా ఎలాంటి చర్యలు తాము తీసుకోవడం లేదని తెలిపాయి. బ్యాంక్‌లో ఎలాంటి ఎన్‌పీఏ సమస్య లేదని ఆర్బీఐ వర్గాల పేర్కొన్నాయి.
