అమ్మకానికి రాంకీ ఎన్విరో
హైదరాబాద్‌కు చెందిన రాంకీ ఎన్విరో (ప్రస్తుత పేరు (ఆర్‌ఈ సస్టయినబిలిటి- Re Sustainability) అమ్మకానికి పెట్టారు. ఈ కంపెనీలో ప్రధాన వాటాదారు KKR గ్రూపుతో పాటు మరో ప్రధాన వాటాదారు అయోధ్య రామిరెడ్డి కూడా తమ వాటా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కంపెనీలో ప్రముఖ ఇన్వెస్టింగ్ కంపెనీ KKR ఏప్రిల్ 18, 2021న 60 శాతం వాటాను 50 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. మిగిలిన 40 శాతం వాటా అయోధ్య రామిరెడ్డి పేరున ఉంది. ఇపుడు ఈ కంపెనీ నుంచి ఇద్దరూ బయటపడాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ కంపెనీ వ్యాల్యుయేషన్ 150 కోట్ల డాలర్లుగా చెబుతున్నారు. కంపెనీని స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ చేయాలని భావించినా… ఇపుడు అమ్మేయాలని భావిస్తున్నారు. వాటాలను అమ్మే ప్రక్రియను చూసేందుకు JP మోర్గాన్ సంస్థతో కేకేఆర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.