For Money

Business News

ఇవాళ డౌజోన్స్‌ వంతు

నిన్నటి దాకా వాల్‌స్ట్రీట్‌ టెక్‌, ఐటీ షేర్ల హవా కొనసాగగా ఇవాళ డౌజోన్స్‌ రాణిస్తోంది. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు అర శాతం లాభంతో ఉండగా, డౌజోన్స్‌ 0.8 శాతం లాభంతో ఉండటం విశేషం. గూగుల్‌ను విభజించాలని అమెరికా న్యాయ విభాగం ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో గూగుల్‌ షేర్‌ స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. ఒకవేళ ఇదే అంశంపై కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా…తాము అప్పీల్‌కు వెళతామని గూగుల్‌ స్పష్టం చేసింది. నిన్నటి దాకా భారీ లాభాలు గడించిన సెమి కండెక్టర్‌ షేర్లు ఎన్‌విడియా, ఏఎండీ షేర్లు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. మరోవైపు డాలర్‌ స్థిరంగా ఉన్నా… క్రూడ్‌ ఆయిల్‌ స్వల్పంగా నష్టంతో ట్రేడవుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ 76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బులియన్‌ మార్కెట్‌ కూడా స్థిరంగా ఉంది.