For Money

Business News

ఈ ర్యాలీ ఎంత వరకు?

ఒకవైపు ఎన్నికల ఫలితాల టెన్షన్‌ మార్కెట్‌లో కొనసాగుతున్నా… సూచీలు మాత్రం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఎలాగైనా సరే ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చాలా మంది ట్రేడర్లు భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు భారీ మొత్తాన్ని మన మార్కెట్ నుంచి చైనాకు తరలిస్తున్నా… సూచీలకు, షేర్లకు రీటైల్‌ ఇన్వెస్టర్లు మద్దతు అందిస్తున్నారు. ఆ ఊపుతో ఇవాళ మార్కెట్లు ఒక శాతం దాకా లాభపడ్డాయి. నిఫ్టి 22,450పైన ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ నుంచి గట్టి మద్దతు లభించింది. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ దాదాపు క్రితం ముగింపు వద్ద ముగిశాయి. బ్యాంక్‌ షేర్లు, నాన్‌ బ్యాంకింగ్‌ షేర్లు కూడా ఒక మోస్తరు లాభాలకే పరిమితం అయ్యాయి. ఎం అండ్‌ ఎం, గ్రాసిం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్‌ షేర్లు నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. నష్టపోయిన నిఫ్టి షేర్లలో సిప్లా, టీసీఎస్‌, ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బ్రిటానియా టాప్‌లో ఉన్నాయి. ఇవి దాదాపు ఒక శాతం నష్టంతో ముగిశాయి. రియాల్టీలో జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు అత్యంత సంక్లిష్టమైన వ్యూహాలతో మన మార్కెట్లలో ట్రేడ్‌ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న కొద్దీ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఎక్కువ అయ్యే అవకాశముంది. రీటైల్‌ ఇన్వెస్టర్లు తమ క్యాపిటల్‌ను సంరక్షించుకునేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది.