ఆరోవారం నాస్‌డాక్ శుభారంభం
వాల్‌స్ట్రీట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. దాదాపు అయిదు వారాలు లాభాల్లో ముగిసిన నాస్‌డాక్ ఇవాళ కూడా దాదాపు అర శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈవారం పలు మెగా కంపెనీల ఫలితాలు ఉండటంతో పాటు మార్కెట్ సెంటిమెంట్ మెరుగ్గా ఉండటంతో మూడు ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ఇవాళ డౌజోన్స్ 0.64 శాతం లాభంతో ట్రేడవుతుండటం విశేషం. డాలర్ ఇండెక్స్ ఇవాళ కూడా 104 ప్రాంతంలో ఉంటోంది. ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడి చేయమని ప్రకటించిన ఇజ్రాయిల్… మొన్నటి దాడుల్లో మాట నిలబెట్టుకుంది. దీంతో క్రూడ్ ఆయిల్ సరఫరాపై ఉన్న అనుమానాలు పోయాయి. దీంతో క్రూడ్ ధరలు భారీగా క్షీణించాయి. ప్రస్తుతం సుమారు ఆరు శాతం నష్టంతో క్రూడ్ ట్రేడవుతోంది. ఇక బులియన్ మార్కెట్‌లో పెద్ద మార్పులు లేవు. వెండి, బంగారం స్థిరంగా ట్రేడవుతున్నాయి.