కొనసాగుతున్న అప్‌ట్రెండ్
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు తరవాత ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అప్ ట్రెండ్ కొనసాగుతోంది. అమెరికా ఫ్యూచర్స్ అరశాతంపైగా లాభంతో ఉండగా… యూరప్ మార్కెట్లు కూడా ఒక శాతం దాకా లాభపడ్డాయి. యూరో స్టాక్స్ 50 సూచీ ప్రస్తుతం 0.9 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టిలో కూడా ర్యాలీ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కాస్త ఒత్తిడి కన్పించినా.. యూరో మార్కెట్ల ఉత్సాహంతో నిఫ్టి 17100పైన ట్రేడవుతోంది. ఒకదశలో 17018కి పడినా ఇపుడు 17105 పాయింట్ల వద్ద 176 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ నిఫ్టి బ్యాంక్ 0.35 శాతమే లాభపడగా, నిఫ్టి మిడ్ క్యాప్ 1.6 శాతంతో భారీగా పుంజుకుంది. ముఖ్యంగా ఐఆర్‌సీటీ ఆరు శాతం లాభపడింది. పలుసూచీలు ఇవాళ ఉదయం ఒత్తిడికి లోనైనా.. ఇపుడు ఇవాళ్టి గరిష్ఠ స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతున్నందున నిఫ్టి… ఇదే లాభాలను కొనసాగించవచ్చు.