రెయిన్బో హాస్పిటల్: భారీగా లిస్టింగ్ నష్టాలు
హైదరాబాద్‌కు చెందిన రెయిన్బో హాస్పిటల్ ఐపీఓకు దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకున్నారు. ఓపెనింగ్ రోజే ఏకంగా 11 శాతం ఈ షేర్ నష్టపోయింది. ఈ షేర్‌ను కంపెనీ రూ. 542లకు ఇష్యూ చేయగా ఒక మోస్తరుగా సబ్స్క్రయిబ్ అయింది. ఇష్యూ ధరతో పోలిస్తే 6 శాతం నష్టంతో ఈ షేర్ రూ. 506 వద్ద లిస్టయింది. అక్కడి నుంచి రూ. 519కి పెరిగిన షేర్లను ఇన్వెస్టర్లు భారీ అమ్మడంతో రూ. 484కు వచ్చింది. అక్కడి నుంచి కోలుకుని మళ్ళీ రూ.505కు వచ్చినా ఫలితం లేకపోయింది.రూ.500పైన ఈ షేర్లో భారీ ఒత్తిడి వస్తోంది. దీంతో ఇపుడు ఈ షేర్ 11 శాతం నష్టంతో రూ. 480 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి వరకు గ్రేమార్కెట్లో రూ.15 ప్రీమియం ఉన్న షేర్ లిస్టింగ్ రోజు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. మార్కెట్ స్థిరంగా ఉన్నా ఈ షేర్లో భారీ ఒత్తిడి రావడం విశేషం.