60 రోజులకే రిజ్వేషన్
ప్రస్తుతం రైల్వే ప్రయాణానికి రిజర్వేషన్ కావాలంటే 120 రోజుల ముందుగానే టికెట్ల బుకింగ్ చేసుకోవాలి. దీన్ని 60 రోజులకు కుదించినట్లు భారత రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించి ఐఆర్‌సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది. వచ్చే నవంబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. వాస్తవానికి పాత పద్ధతిలో టికెట్ల రిజర్వేషన్ 60 రోజుల కిందటే ఉండేది. దీన్ని 120 రోజులకు పెంచి ఇపుడు మళ్ళీ 60 రోజులకు తగ్గించారు. ఒకవేళ ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఇది వరకే తీసుకున్న తేదీకి ప్రయాణం చేయొచ్చని పేర్కొంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి రిజర్వేషన్ల హడావుడి అధికంగా ఉంటుంది. జనవరిలో పండుగ ఉంటే… రిజర్వేషన్లు అక్టోబర్ నుంచే చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి నవంబర్‌లో నెలలో చేసుకునే అవకాశ కల్గింది. విదేశీ పర్యటకులు మాత్రం 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. ఇందులోనూ ఎలాంటి మార్పూ లేదు.