For Money

Business News

నిరాశపర్చిన రిలయన్స్‌

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 15,792 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది అంటే డిసెంబర్‌ 2021 త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 15 శాతం క్షీణించింది. అలాగే ఆదాయం కూడా 15.3 శాతం క్షీణించి రూ. 2.20 లక్షల కోట్లకు చేరింది. నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ జారీ ద్వారా రూ. 20,000 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. రిలయన్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్న జియో విభాగం ఈ త్రైమాసికంలో కూడా రూ. 4638 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 28.29 శాతం పెరిగింది. జియో టర్నోవర్‌ కూడా 18.87 శాతం పెరిగి రూ. 22,998 కోట్లకు చేరింది.